నాగర్కర్నూల్ రూరల్, ఏప్రిల్ 8 : కేజీబీవీలో 9వ తరగతి చదువుతున్న యామిని స్టడీ అవర్కు ఆలస్యంగా వచ్చిందనే కోపంతో ఇంగ్లిష్ టీచర్ 3 గంటలపాటు బయట నిల్చోబెట్టిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా నాగనూల్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మనస్తాపం చెందిన విద్యార్థిని కత్తితో చేతిని కోసుకుని ఆత్మహత్యకుయత్నించింది.
విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు మంగళవారం పాఠశాలకు వచ్చి ప్రజాసంఘాలతో కలిసి ధర్నాకు దిగారు. సదరు టీచర్ను వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.