ఖైరతాబాద్, సెప్టెంబర్ 23: కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే పెండింగ్ కమీషన్లు ఇవ్వకుంటే సమ్మెకు దిగుతామంటూ తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయకోటి రాజు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన సర్కారుపై నిప్పు లు చెరిగారు. ప్రజాపంపిణీలో దేశంలో నే తెలంగాణ మొదటిస్థానంలో ఉందని గుర్తుచేశారు. రాష్ట్రంలోని 17,200 పైచిలుకు రేషన్‌డీలర్లు క్రమం తప్పకుండా కోట్లాదిమంది పేద ప్రజలకు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ఆహారాన్ని అందిస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వం హ యాంలో తమ కమీషన్లు ఎప్పుడూ ఆగలేదని, రెండేండ్లుగా మాత్రం రేషన్ డీలర్లను కాంగ్రెస్ ప్రభుత్వం సతాయిస్తుందని మండిపడ్డారు.
కేంద్రం కమీషన్లు విడుదల చేసినా రేవంత్ సర్కారు మాత్రం వాటిని చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తుందని ధ్వజమెత్తారు. మంత్రులు, ఉన్నతాధికారులకు వినతి పత్రాలు సమర్పించినా అవి చెత్తబుట్టల పాలవుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశా రు. ప్రభుత్వ చర్యలతో దసరా, దీపావళి పండుగకు పస్తులే ఉండాల్సి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయని వాపోయారు. 30లోగా తమకు కమీషన్లు చెల్లించకుం టే 1,2 తేదీల్లో రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్యాలయం ఎదుట నిరాహార దీక్షకు పూనుకుంటామని, ఆ తర్వాత 45 రోజుల్లో సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున్ గౌడ్, నాయకులు అన్వర్ పాషా, నందయ్య, ఆనంద్‌కుమార్, నాగేశ్, శ్రీకాంత్, మురళీమోహన్, వీ నాగరాజు, మహేశ్వర్, సత్యనారాయణరెడ్డి, శేషగిరిరావు, పీ రాజేందర్, కోశాధికారి పీ నాగరాజు, కార్యదర్శి వీ సత్యనారాయణ పాల్గొన్నారు.