Transport Department | విద్యాసంస్థల వాహనాల యాజమాన్యాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : రవాణా శాఖ
Transport Department | రాష్ట్రంలో పాఠశాలలు, విద్యాసంస్థలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు రవాణా శాఖ అధికారులు వెల్లడించారు.
హైదరాబాద్ : రాష్ట్రంలో పాఠశాలలు( Schools ) , విద్యాసంస్థలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక డ్రైవ్ ( Special Drive ) నిర్వహిస్తున్నట్లు రవాణా శాఖ ( Transport Department ) అధికారులు వెల్లడించారు. విద్యార్థులను రవాణా చేసే అన్ని విద్యాసంస్థల బస్సులు , ఇతర వాహనాలు తప్పనిసరిగా ఫిట్నెస్ సర్టిఫికేట్ కలిగి ఉండాలని స్పష్టం చేశారు.
ఫిట్నెస్ లేని వాహనాలు, అధిక సంఖ్యలో విద్యార్థులను ఎక్కించుకొని (Over Loading) నడుపుతున్న వాహనాలు, భద్రతా ప్రమాణాలు పాటించని వాహనాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహనాలకు చెల్లుబాటు అయ్యే ఫిట్నెస్ సర్టిఫికేట్, పర్మిట్, ఇన్సూరెన్స్, కాలుష్య నియంత్రణ సర్టిఫికేట్ కచ్చితంగా ఉండాలని సూచించారు.
వాహనాలలో అనుమతించిన సామర్థ్యానికి మించి విద్యార్థులను తరలిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. డ్రైవర్లకుడ్రైవింగ్ లైసెన్స్ , అనుభవం , ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఫైర్ ఎక్సిటింగ్విషర్, ఎమర్జెన్సీ ఎగ్జిట్ వంటి భద్రతా సౌకర్యాలు, విద్యార్థుల భద్రత కోసం అటెండర్ను నియమించాలన్నారు. ఫిట్నెస్ లేకుండా నడుస్తున్న వాహనాలు లేదా ఓవర్లోడ్ చేస్తున్న వాహనాలను వెంటనే సీజ్ చేస్తామన్నారు. అధిక సంఖ్యలో విద్యార్థులను ఎక్కించుకునే (Over Loaded ) వాహనాలలో తమ పిల్లలను పంపవద్దని తల్లిదండ్రులకు రవాణా శాఖ సూచించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎదుళ్ల నుండి డిండిని అడ్డుకోవద్దు : శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
Zelensky: రష్యా దాడి.. 6 లక్షల మంది అంధకారంలో: జెలెన్స్కీ
SriLankan Tamil Engineer | శ్రీలంక తమిళ ఇంజినీర్కు ఊరట.. మరణశిక్షను రద్దు చేసిన సౌదీ సుప్రీంకోర్టు
Medak | మెదక్ జిల్లాలో హైవేపై లారీ బోల్తా.. 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్!
Mary Millben: కాక్రోచ్ జనతా పార్టీకి అమెరికా నుంచి నిధులు: సింగర్ మేరీ మిల్బెన్ ఆరోపణ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

