మాస్కులు ధరించని వారిపై చర్యలు: డీజీపీ మహేందర్ రెడ్డి
డీజీపీ| మాస్కులు ధరించని వారిపై చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించనివారిపై కేసులు నమోదుచేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది.

హైదరాబాద్: మాస్కులు ధరించని వారిపై చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించనివారిపై కేసులు నమోదుచేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా పోలీసు, జైళ్లు, శిశు సంక్షేమ శాఖల అధికారులు నివేదికలు సమర్పించారు. గతనెల 20 నుంచి ఈ నెల 5 వరకు 87,890 కేసులు నమోదుచేశామని, రూ.52 కోట్ల జరిమానా విధించామని డీజీపీ తెలిపారు.
అదేవిధంగా రాష్ట్రంలోని జైళ్లలో ఉన్న ఖైదీలకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నదని జైళ్ల శాఖ డీజీ వెల్లడించారు. 732 మంది ఖైదీలకు రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయిందని వెల్లడించారు. 6,127 మంది ఖైదీలకు మొదటి డోసు అందించామని చెప్పారు. మరో 1,244 మంది ఖైదీలకు టీకాలు ఇవ్వాల్సి ఉందని చెప్పారు.
కరోనా వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల బాగోగులు చూస్తున్నామని శిశు సంక్షేమ శాఖ వెల్లడించింది. ఒక్కో చిన్నారికి ఒక నోడల్ అధికారిని నియమించామని తెలిపింది. ఆన్లైన్ బోధనకు సంబంధించిన మార్గదర్శకాలను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ హైకోర్టుకు కోర్టుకు సమర్పించారు. విద్యా సంస్థల్లో ఆన్లైన్ తరగతులే నిర్వహిస్తున్నామని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
బాలీవుడ్ లెజెండ్ దిలీప్ కుమార్ ఇక లేరు
దిలీప్ కుమార్ ప్రతి చిత్రం మేలిమి ముత్యం .. ఆయన నటన ఎవరెస్ట్ శిఖరం
దిలీప్ కుమార్ కన్నుమూత.. ఒక శకం ముగిసిందంటూ సెలబ్స్ ట్వీట్స్
ఎందరో నటులకు స్ఫూర్తిప్రదాత.. దిలీప్‌కుమార్ మృతికి మంత్రి కేటీఆర్ నివాళి
ఇండియన్ క్రికెట్ చరిత్రనే తిరగరాసిన ధోనీ ఆ ఐదు నిర్ణయాలు
తెలంగాణలో కెనడా సంస్థ రూ.740కోట్ల భారీ పెట్టుబడి
మమతా బెనర్జీకి 5 లక్షల ఫైన్.. కేసు నుంచి తప్పుకున్న జడ్జి
ఆస్టరాయిడ్ల దారి మళ్లించడానికి.. 20 రాకెట్లను పంపించనున్న చైనా
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

