ఆస్టరాయిడ్ల దారి మళ్లించడానికి.. 20 రాకెట్లను పంపించనున్న చైనా

బీజింగ్: ఆస్టరాయిడ్ల నుంచి ఎప్పుడూ భూమికి ముప్పు పొంచే ఉంది. ఈ గ్రహ శకలాలు ఎన్నోసార్లు భూమికి దగ్గరగా వెళ్తుండగా.. కొన్ని చిన్న చిన్నవి భూమిని ఢీకొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. భవిష్యత్తులో ఇలాంటి భారీ పరిమాణంలో ఉన్న ఆస్టరాయిడ్ మన గ్రహాన్ని ఢీకొట్టే ప్రమాదం ఉందని సైంటిస్టులు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఇప్పుడు అలాంటి ఆస్టరాయిడ్లనే దారి మళ్లించే ప్రయత్నం చేస్తోంది చైనా.
నాసా బాటలోనే..
ఇందులో భాగంగా 20 భారీ రాకెట్లను ప్రయోగించాలని చైనా పరిశోధకులు భావిస్తున్నారు. ఇప్పటికే అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా ఇలాంటి ప్రయత్నమే చేస్తోంది. 2021 చివర్లో, 2022 మొదట్లో ఓ రొబోటిక్ స్పేస్‌క్రాఫ్ట్‌ను నాసా లాంచ్ చేయనుంది. ఇది భూమికి దగ్గరగా వస్తున్న రెండు ఆస్టరాయిడ్లను అడ్డుకోనుంది. ఏడాది తర్వాత భూమికి దగ్గరగా రానున్న వాటిలో కాస్త చిన్నగా ఉన్న శకలంపై ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ను క్రాష్ ల్యాండ్ చేసి.. దాని దారి ఎంత వరకూ మళ్లిందో చూడాలని నాసా భావిస్తోంది.
ఇలాగే ఇటు చైనా నేషనల్ స్పేస్ సైన్స్ సెంటర్లోని పరిశోధకులు కూడా సిమ్యులేషన్లు చేసి చూశారు. 23 లాంగ్ మార్చ్ 5 రాకెట్లతో వరుసగా ఢీకొట్టడం వల్ల ఓ పెద్ద ఆస్టరాయిడ్ తన దారి నుంచి భూ వ్యాసం కంటే 1.4 రెట్లు ఎక్కువ దూరం వెళ్లే అవకాశం ఉన్నట్లు ఈ సిమ్యులేషన్లలో గుర్తించారు. బెన్ను అనే ఓ భారీ ఆస్టరాయిడ్‌ను లెక్కలోకి తీసుకొని వాళ్లు ఈ అంచనా వేశారు. ఈ బెన్ను ఆస్టరాయిడ్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ అంత భారీగా ఉంటుంది. ఒక కి.మీ. పెద్దదైన ఆస్టరాయిడ్ల వల్ల భూమిపై ఉన్న ఒక ప్రాంతం లేదా ఒక ఖండానికే పెను ప్రమాదమని సైంటిస్టులు చెబుతున్నారు.
లాంగ్ మార్చ్ 5 రాకెట్
చైనా అంతరిక్షంలో చేపట్టబోతున్న ఎన్నో కీలక ప్రాజెక్టులలో ఈ లాంగ్ మార్చ్ 5 రాకెట్ కీ రోల్ ప్లే చేయబోతోంది. స్పేస్ స్టేషన్ మాడ్యూల్స్‌ను తీసుకెళ్లడం, చంద్రుడు, మార్స్‌పైకి రోవర్లను లాంచ్ చేయడంలో ఈ రాకెట్‌నే చైనా వినియోగించనుంది. ఇప్పుడీ రాకెట్లనే ఆస్టరాయిడ్ల దారి మళ్లించడానికి కూడా ఆ దేశం ఉపయోగించనుడటం విశేషం. ప్రస్తుత అంచనాల ప్రకారం 100 మీటర్ల వెడల్పు ఉన్న ఆస్టరాయిడ్ వచ్చే వందేళ్లలో భూమిని ఢీకొట్టే అవకాశాలు ఒక శాతం ఉన్నాయి.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Water Crisis | తాగేందుకు నీళ్లు లేవు.. బాత్రూంకూ బయటకే వెళ్లాల్సిన దుస్థితి.. బషీరాబాద్ ఎస్సీ హాస్టల్లో నీటి కష్టాలు!
సంగారెడ్డి జిల్లాలో అగ్నిప్రమాదం.. PURE EV స్కూటీ తయారీ కంపెనీలో ఎగిసిపడుతున్న మంటలు
Payal Rajput | రాధికా ఆప్టే వ్యాఖ్యలకు పాయల్ రాజ్‌పుత్ స్ట్రాంగ్ కౌంటర్.. ‘టాలీవుడ్ వల్లే ఈ స్థాయిలో ఉన్నా!’
Khammam SDRF | గల్లంతైన 11 మంది ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిలో 10 మంది క్షేమం.. ఒకరి కోసం గాలింపు
Jailer 2 OTT | ఓటీటీలోకి రజనీకాంత్ ‘జైలర్ 2’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

