హైదరాబాద్, జూన్5 (నమస్తే తెలంగాణ): నీట్ ఫలితాల్లో తెలంగాణ గురుకుల విద్యార్థులు మరోసారి సత్తాచాటారు. సాంఘిక, సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ ఆధ్వర్యంలోని సీవోఈలో ఆపరేషన్ బ్లూ క్రిస్టల్ పేరిట విద్యార్థులకు నీట్ శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ పొందిన విద్యార్థుల్లో 206 మంది, ఎస్సీ గురుకులాలకు చెందిన 76మంది విద్యార్థులు (మొత్తంగా 282మంది) నీట్ పరీక్షలో ఉత్తమ ఫలితాలు సాధించారు. గౌలిదొడ్డి గురుకులానికి చెందిన సాయివంశీ 1708, హేమంత్ 1937, కావేరి 490, రిష్వంత్ 2435 ర్యాంకులను సొంతం చేసుకున్నారు. బీసీ సీవోఈ కాలేజీల నుంచి 120మంది అర్హత సాధించారు. ఏడుగురు ఎంబీబీఎస్, 25మంది బీడీఎస్ సీట్లను సాధించే అవకాశముందని బీసీ గురుకుల అధికారులు తెలిపారు. ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి, బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి సైదులు విద్యార్థులను అభినందించారు. కాగా, 34 మంది తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (టీఎస్ఆర్జేసీ) విద్యార్థులు నీట్‌కు అర్హత సాధించినట్టు సంస్థ కార్యదర్శి సీహెచ్ రమణకుమార్ తెలిపారు.
నీట్ ఫలితాల్లో గిరిజన విద్యార్థుల సత్తా
నీట్ ఫలితాల్లో 87మంది గిరిజన విద్యార్థులు అత్యత్తమ ప్రతిభను చాటగా, 67మందికి మెడికల్ సీట్లు వచ్చే అవకాశముందని అధికారులు వెల్లడించారు. చెంచు కమ్యూనిటీ నుంచి ప్రభాస్, కోయ తెగకు చెందిన అక్షిత్, కోలావర్ తెగకు చెందిన శిరీష ప్రతిభ చాటారు. వారిని గిరిజన గురుకులాల సొసైటీ కార్యదర్శి డాక్టర్ శరత్ అభినందించారు.
ఆలిండియా 9 ఫస్ట్ర్యాంకులు శ్రీచైతన్యవే
ఓపెన్ క్యాటగిరీలో 9 ఆలిండియా మొదటి ర్యాం కులను సొంతం చేసుకున్నట్టు శ్రీచైతన్య విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ సుష్మ తెలిపారు. విద్యార్థులు కళ్యాణ్,పవన్‌కుమార్‌రెడ్డి, ముఖేష్చౌదరి, జీ భానుతేజసాయి, ఇరాన్ఖ్వాజీ, దర్శ్పగ్దార్, ఇషాకొఠారి, ఆదర్శ్‌సింగ్ మోయల్, అమీనా ఆరిఫ్కడివాల 720 మార్కులతో ఫస్ట్‌ర్యాంకు వచ్చినట్టు పేర్కొన్నారు. 9మందికి 720 మార్కులు, 715 మార్కులపైగా 30 మంది, 710 మార్కులపైగా 57మంది,700 మా ర్కులకుపైగా 127మంది, 650 మార్కులపైగా 852 మంది విద్యార్థులు సత్తాచాటారని వివరించారు.