సంస్థాగత నిర్మాణంతోనే పార్టీకి బలం : మంత్రి సత్యవతి
మంత్రి సత్యవతి | సంస్థాగత నిర్మాణం పటిష్టంగా ఉంటేనే పార్టీ బలంగా ఉంటుందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.

మంచిర్యాల : సంస్థాగత నిర్మాణం పటిష్టంగా ఉంటేనే పార్టీ బలంగా ఉంటుందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. టీఆర్ఎస్ పార్టీ సంస్థాగత నిర్మాణం పటిష్టం చేయడంలో భాగంగా బెల్లంపల్లి నియోజక వర్గంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అధ్యక్షతన పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భవించింది 20 ఏళ్లు పూర్తి చేసుకుని 21వ సంవత్సరంలోకి వెళ్తున్నాం. ప్రతి రెండేళ్లకు ఒకసారి ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ఈ నెల ఆఖరి లోపు పార్టీ సంస్థాగత నిర్మాణం పూర్తి చేసుకుంటామన్నారు.
10 మందితో జల దృశ్యంలో ప్రారంభమైన పార్టీ నేడు 60 లక్షలకు పైగా కుటుంబ సభ్యులతో రాష్ట్రంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిందని మంత్రి పేర్కొన్నారు. గ్రామ సమస్యలపై స్పందించే వారిని, పార్టీని పటిష్టం చేసే వారిని పార్టీ బాధ్యులుగా నియమిస్తామన్నారు. టీఆర్ఎస్ పార్టీలో పని చేయడం నిజంగా అదృష్టంగా భావించాలన్నారు.

మనం రోజువారీ పనులతో పాటు పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం కూడా మన ఇంట్లో ముఖ్య కార్యక్రమాలకు ఇచ్చే ప్రాధాన్యత ఇచ్చి పని చేయాలని మంత్రి కోరారు.
రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి దేశానికే ఆదర్శంగా నిలిచామన్నారు. మన ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు సరైన విధంగా అందించేందుకు పార్టీ నేతలు వారధులుగా పని చేయాలని కార్యకర్తలకు సూచించారు.
సమావేశంలో జెడ్పీ వైస్ చైర్ పర్సన్ సత్యనారాయణ , గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రవీణ్, మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత, వైస్ చైర్మన్ సుదర్శన్, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Good news | మెట్రో రైలు సేవలు మరో అరగంట పొడిగింపు
విషాదం : నీటి కుంటలో పడి బాలుడు మృతి
Yadadri temple : యాదాద్రిలో భక్తుల కోలాహలం
విద్యతోనే మానవ వనరుల అభివృద్ధి: మంత్రి హరీశ్ రావు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

