విద్యతోనే మానవ వనరుల అభివృద్ధి: మంత్రి హరీశ్ రావు
మంత్రి హరీశ్ రావు | జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికీ మంత్రి హరీశ్ రావు శుభాకాంక్షలు తెలిపారు. విద్య ద్వారానే మానవ వనరులు అభివృద్ధి చెందుతాయని అన్నారు.

హైదరాబాద్: జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికీ మంత్రి హరీశ్ రావు శుభాకాంక్షలు తెలిపారు. విద్య ద్వారానే మానవ వనరులు అభివృద్ధి చెందుతాయని అన్నారు. భారతీయ సంప్రదాయంలో దేవుడితో సమానమైన స్థానం గురువులకు ఉందని చెప్పారు. పిల్లలను బాధ్యతాయుత పౌరులుగా మార్చడంలో ఉపాధ్యాయుల కృషి గొప్పదని పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలోనూ భౌతిక తరగతులు లేకున్నా.. ఆన్లైన్ క్లాసులతో బోధనకు అంతరాయం కలగకుండా కృషిచేశారని వెల్లడించారు.
సీఎం కేసీఆర్ తెలంగాణలో విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా అత్యధిక గురుకులాలు ఏర్పాటు చేసుకుని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని చెప్పారు. విద్యావిధానంలో దేశానికే తెలంగాణ తలమానికంగా నిలవాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమన్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ విద్యార్థుల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ విద్యా బోధన చేయాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

