సిద్దిపేట జిల్లా ; సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం ఉమ్మాపూర్ గ్రామ పరిధిలోని పాటిగడ్డ మీద కొత్తరాతియుగం ఆనవాళ్లు లభించాయి. కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధక సభ్యుడు అహోబిలం కరుణాకర్ అక్కడ ఆనాటి రాతి మొద్దు కత్తిని గుర్తించారు. ఇది 10 అంగుళాల పొడవు, 7 అంగుళాల వెడల్పు ఉన్నది. వేటాడిన జంతువులను కోసుకొని తినడానికి, ముక్కలుగా నరకడానికి వాడిన పనిముట్లలో ఇది ఒకటని, పట్టుకోవడానికి పిడికిలి ఉన్న పదునైన అంచున్న రాతి కత్తి ఇదని కరుణాకర్ తెలిపారు. సమీపంలో పెద్దరాతియుగం సమాధులు కూడా ఉన్నాయని ఆయన తెలిపారు.