మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 11: మెదక్ శివారు పసుపులేరువాగులో పాత రాతియుగం నుంచి కొత్తరాతి యుగం వరకు వాడిన రాతి పనిముట్లు, ఆంథ్రోపొమార్ఫిక్ శిలను గుర్తించినట్టు కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధక సభ్యుడు మచ్చ ప్రణయ్‌కుమార్ శనివారం తెలిపారు.
ఈ శిల గతంలో సిద్దిపేట జిల్లా పుల్లూరు తవ్వకాల్లో బయట పడిన రాతికడ్డీ అమ్మదేవతను పోలి ఉందన్నారు. ఈ రాతికడ్డీ దేశంలోనే అరుదైనదని, పసుపులేరు వాగులో గుర్తించిన ఈ రాతికడ్డీ శిల కొంత భాగం అరిగిపోయిందని చెప్పారు. 11 సెంటిమీటర్ల ఎత్తు, 5 సెంటిమీటర్ల మందంతో ఉన్న ఈ శిల 5వేల ఏండ్ల క్రితం నాటిదని అభిప్రాయపడ్డారు.