రెవెన్యూ రాబడి 14,137 కోట్లు
రాష్ట్ర రెవెన్యూ శాఖ సరికొత్త రికార్డు సృష్టించింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో భారీగా ఆదాయాన్ని ఆర్జించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల లావాదేవీల ద్వారా రూ.15,600 కోట్ల రాబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది.
- నిరుటి కంటే రూ.1,800 కోట్లు అధికం
- రాష్ట్రంలో జోరుగా భూముల లావాదేవీలు
హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర రెవెన్యూ శాఖ సరికొత్త రికార్డు సృష్టించింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో భారీగా ఆదాయాన్ని ఆర్జించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల లావాదేవీల ద్వారా రూ.15,600 కోట్ల రాబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. దీన్ని నిజం చేస్తూ రూ.14,137 కోట్ల ఆదాయం వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. ఇది గత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన రాబడి కంటే రూ.1,800 కోట్లు అధికమని, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం రూ.14 వేల కోట్లు దాటడం ఇదే తొలిసారని వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల క్రయవిక్రయాలకు సంబంధించి 19.20 లక్షలకుపైగా డాక్యుమెంట్లు రిజిస్టర్ అయినట్టు తెలిపారు.
తొమ్మిదేండ్లలో 550% పెరుగుదల
2014-15 ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ.2,175 కోట్లుగా ఉన్న స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ రాబడి గత తొమ్మిదేండ్లలో ఏకంగా 552% పెరగడం గమనార్హం. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాల ఫలితంగా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లుతున్నది. 2014-15లో సుమారు 9 లక్షల డాక్యుమెంట్లు రిజిస్టర్ కాగా.. ప్రస్తుతం అవి రెట్టింపునకుపైగా పెరగడం ఇందుకు నిదర్శనం.
వచ్చే ఏడాది మరింత జోరుగా
2023-24 ఆర్థిక సంవత్సరంలోనూ రిజిస్ట్రేషన్ల జోరు మరింత పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తున్నది. ‘రియల్’ నిపుణులు సైతం ఇదే విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో సంస్కరణల పథం కొనసాగుతుండటం, ఫాక్స్‌కాన్ లాంటి ప్రతిష్ఠాత్మక కంపెనీలు పెట్టుబడులు పెట్టడం లాంటి పరిణామాల నేపథ్యంలో ఈ ఏడాది స్థిరాస్తి లావాదేవీలు మరింత భారీగా జరుగుతాయని అంచనా వేస్తున్నారు. తెలంగాణ మాడల్‌ను సీఎం కేసీఆర్ దేశవ్యాప్తంగా పరిచయం చేస్తుండటం కూడా రాష్ర్టానికి ఎంతో కలిసి వచ్చే అంశమని చెప్తున్నారు. తెలంగాణ అభివృద్ధిని తెలుసుకొని ఇక్కడి రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులకు మరింత మంది ఆసక్తిచూపే అవకాశం ఉన్నదని అంటున్నారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

