కడ్తాల్, అక్టోబర్ 20: రాష్ట్రంలోని గ్రామాలాన్నింటినీ సీఎం కేసీఆర్ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి పేర్కొన్నారు. ఢిల్లీలోని బీఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో.. గ్రామ పంచాయతీల అభివృద్ధి ప్రణాళికపై రెండ్రోజుల పాటు నిర్వహించిన శిక్షణ తరగతుల్లో రాష్ట్రం తరఫున రంగారెడ్డి జిల్లాలోని కడ్తాల్ గ్రామ సర్పంచ్ లక్ష్మీనర్సిహారెడ్డి పాల్గొన్నారు.
శిక్షణ తరగతుల్లో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికతో పాటు గ్రామాల్లో పేదరిక నిర్మూలన, మెరుగైన జీవనోపాధి, గ్రామాల్లో మౌలిక వసతులు తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వ, రాష్ర్టాల అధికారులు, ప్రజాప్రతినిధులతో చర్చించినట్టు సర్పంచ్ తెలిపారు. రాష్ట్రంలోని గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ చేపట్టిన కార్యక్రమాల గురించి సదస్సులో వివరించిన్నట్టు సర్పంచ్ పేర్కొన్నారు. సదస్సులో రాష్ట్రం నుంచి పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ జాన్వెస్లీ, డీపీవో నారాయణరెడ్డి, ఎంపీడీవోలు శ్రీనివాస్, బాల్రెడ్డి, భానుప్రసాద్ పాల్గొన్నారు.