హైదరాబాద్, మే18 (నమస్తే తెలంగాణ): సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయుల పదోన్నతుల విషయంలో న్యాయపరమైన అడ్డంకులు తొలగిన నేపథ్యంలో 317జీవో అమలు, పదోన్నతులు, బదిలీలను వెంటనే పూర్తి చేయాలని టీజీ యూటీఎఫ్ సాంఘిక సంక్షేమ గురుకుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు దూలం ఎల్లయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఆరేండ్లుగా సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీల్లో పదోన్నతులు, బదిలీలు లేక ఉపాధ్యాయులు, విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతున్నదని తెలిపారు. ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిషరించాలని డిమాండ్ చేశారు. లేదంటే దశలవారీగా ఆందోళనలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.