హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): ఈ నెల 10న తెలంగాణ సంచార జాతుల విముక్తి దినోత్సవాన్ని హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నారు. ఈ మేరకు టీజీఎంబీసీడీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర మంత్రులు, ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.