హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర వైద్య సేవల మౌలిక వసతుల కల్పన సంస్థ చైర్మన్ (టీఎస్ఎంఎస్ఐడీసీ) ఎర్రోళ్ల శ్రీనివాస్ నేతృత్వంలో వైద్యాధికారుల బృందం మంగళవారం తమిళనాడులో పర్యటించింది.
రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు చెన్నైలో పర్యటించిన బృందం.. అక్కడి తమిళనాడు స్టేట్ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్టక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎన్ఎంఎస్ఐడీసీ) విధివిధానాలను పరిశీలించింది. కార్యక్రమంలో తమిళనాడు వైద్యారోగ్యశాఖ మంత్రి సుబ్రమణ్యన్, ఆ శాఖ కార్యదర్శి రాధాకృష్ణన్, టీఎన్ఎంఎస్ఐడీసీ ఎండీ దీపక్, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి, ఈడీ కౌటిల్య పాల్గొన్నారు.