హైదరాబాద్, ఫిబ్రవరి 4(నమస్తే తెలంగాణ): స్థానిక యువతకు సాంకేతిక విద్య, నైపుణ్య శిక్షణ అందించేందుకు నూతన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ)ను ప్రభుత్వం మంజూరు చేసింది. రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామంలోని సర్వే నెంబరు 287లో గల ప్రభుత్వ స్థలంలో ఏటీసీని మంజూరు చేస్తూ మంగళవారం సర్కారు ఉత్తర్వులు జారీచేసింది.
ఉపాధి, శిక్షణ శాఖ కమిషనర్ విజ్ఞప్తి మేరకు ఏటీసీని ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొంది. ఆరు కోర్సులు, 244సీట్లతో నూతన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ను ఏర్పాటు చేయనున్నది. సిబ్బంది నియామకం త్వరలో చేపట్టనున్నట్టు వెల్లడించింది.