హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం హైకోర్టులోయాక్టింగ్ చీఫ్ జస్టిస్ సుజయ్‌పాల్ జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయాధికారులు, న్యాయవాదులు హాజరయ్యారు.
తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా గత పదేండ్లు జరిగిన కార్యక్రమాల్లో హైకోర్టు చీఫ్ జస్టిస్‌లు ప్రసంగించారు. కానీ, ఈసారి మాత్రం యాక్టింగ్ సీజే ప్రసంగించకుండా జాతీయ పతాక ఆవిష్కరణతో ముగించారు.