హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర గ్రేహౌండ్స్ విభాగంలో ఏఎస్పీ హోదాలో విధులు నిర్వర్తిస్తున్న 10 మంది ఐపీఎస్‌లను బదిలీచేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో 9 మందికి ఆయా జిల్లాల ఏఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు. అంకిత్ కుమార్ శంఖ్వార్ను డీజీపీ ఆఫీస్‌కు అటాచ్ చేశారు.