హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అందజేసే బెస్ట్ టీచర్ అవార్డు గ్రహీతలను నామినేషన్ పద్ధతిలోనే ఎంపికచేయనున్నారు. దీనికి మార్గదర్శకాలను పాఠశాల విద్యాశాఖ సోమవా రం విడుదల చేసింది. ఈసారి రాష్ట్రస్థాయి అవార్డుల ఎంపిక కోసం ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీ ఇన్ ఎ డ్యుకేషన్(ఐఏఎస్ఈ) ప్రిన్సిపాల్ ఏ ఉషారాణిని మెంబర్ కన్వీనర్‌గా నియమించారు.
జిల్లాలవారీగా ఎం ఈవో, డిప్యూటీ ఈవోలు తమ పరిధిలోని బెస్ట్ టీచర్లను ప్రతిపాదించాలి. కలెక్టర్ చైర్మన్‌గా గల కమిటీ జిల్లాకు ముగ్గురి చొప్పున ఎంపికచేస్తుంది. ఈ జాబితాలను 18లోగా స్టేట్ అవార్డుల మెంబర్ కన్వీనర్‌కు పంపిస్తారు. మెంబర్ కన్వీనర్‌తోపాటు రాష్ట్రస్థాయి అవార్డుల కమిటీ 19నుంచి 28 వరకు స్క్రూట్నీ చేసి, బెస్ట్ టీచర్ అవార్డులకు సిఫారసు చేస్తారు.