ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీల పక్షపాతి : మంత్రి గంగుల
ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీ వర్గాలకు సముచిత స్థానం కల్పస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ ,పౌరసరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీ వర్గాలకు సముచిత స్థానం కల్పస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ ,పౌరసరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శాసన మండలిలో బండ ప్రకాశ్‌ను డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నుకున్నందుకు అభినందనల తీర్మానంపై మంత్రి మాట్లాడారు. వెనుకబడిన వర్గాలను రాజకీయం, సామాజికం, ఆర్థికంగా చేయూత నిచ్చి బీసీలకు అండగా నిలబడుతున్నారని ప్రశంసించారు.
బీసీల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న బండా ప్రకాశ్‌ను డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నుకున్నందుకు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. రైతుబంధు సహా అనేక పథకాల్లో బీసీలదే మెజార్టీ వాటా ఉంటుందని అన్నారు. బలహీన వర్గాలకు వెయ్యికి పైగా గురుకులాలు, వేల కోట్ల విలువైన స్థలాల్లో ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తున్నారన్నారు. రాజకీయంగానూ ముదిరాజ్, రజక, నేత, యాదవ, కాపు, గౌడ, బీసీల్లోని సామాజిక వర్గాలకు అవకాశం ఇస్తున్నారన్నారు.
బీసీల అభ్యున్నతికి బీసీ ప్రతినిధులు మరింత కృషి చేయాలని కోరారు. వెనుకబడిన వర్గాల కోసం తపించే బండ ప్రకాశ్ అత్యున్నతమైన డిప్యూటీ చైర్మన్ పదవిని అధిష్టించడం సంతోషంగా ఉందని మంత్రి అభినందనలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

