తిరుపతిలో తోపులాట
తిరుపతిలో శ్రీవారి సర్వదర్శన టోకెన్ల కోసం భక్తులు ఒక్కసారి ఎగబడటంతో తోపులాట చోటుచేసుకున్నది. రెండురోజులుగా టోకెన్ల పంపిణీని నిలిపివేసి మంగళవారం తెరువడంతో భక్తులు ఒకేసారి క్యూలైన్లలో తోసుకురావడంతో ఈ ఘటన జరిగింది. తిరుపతిలోని గోవిందరాజస్వామి సత్రం వద్ద రెండురోజుల తర్వాత టోకెన్ల కౌంటర్లు తెరవడంతో అక్కడ వేచి ఉన్న భక్తులతోపాటు కొత్తగా భక్తులు భారీగా తరలిరావడంతో ఒక్కసారిగా తోపులాట చోటుచేసుకున్నది. ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి.
- దర్శన టోకెన్లకు ఎగబడ్డ భక్తులు
- ముగ్గురికి స్వల్పంగా గాయాలు
- నేటి నుంచి బ్రేక్ దర్శనాలు రద్దు
- టోకెన్లు లేకున్నా భక్తులకు దర్శనం
- వైకుంఠం-2 కంపార్టుమెంట్లు సిద్ధం
తిరుమల/హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): తిరుపతిలో శ్రీవారి సర్వదర్శన టోకెన్ల కోసం భక్తులు ఒక్కసారి ఎగబడటంతో తోపులాట చోటుచేసుకున్నది. రెండురోజులుగా టోకెన్ల పంపిణీని నిలిపివేసి మంగళవారం తెరువడంతో భక్తులు ఒకేసారి క్యూలైన్లలో తోసుకురావడంతో ఈ ఘటన జరిగింది. తిరుపతిలోని గోవిందరాజస్వామి సత్రం వద్ద రెండురోజుల తర్వాత టోకెన్ల కౌంటర్లు తెరవడంతో అక్కడ వేచి ఉన్న భక్తులతోపాటు కొత్తగా భక్తులు భారీగా తరలిరావడంతో ఒక్కసారిగా తోపులాట చోటుచేసుకున్నది. ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి.
ఈ నేపథ్యంలో మంగళవారం ఒక్కరోజు దర్శన టోకెన్లు లేకు న్నా తిరుమలకు టీటీడీ అధికారులు భక్తులను పంపించారు. టోకెన్లు తీసుకున్నవారిని తొలుత, మధ్యాహ్నం 2 గంటల తర్వాత టోకెన్లు తీసుకోని వారిని కూడా కంపార్టుమెంట్లలోకి అనుమతించారు. రెండేండ్ల తర్వా త భక్తులను వైకుంఠం-2 క్యూ కాంప్లెక్స్లోకి అనుమతించారు. ప్రస్తుతం రద్దీ దృష్ట్యా దర్శన టికెట్లు లేని భక్తులను లేపాక్షి వద్ద నుంచి క్యూలైన్లలోకి అనుమతిస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా బుధవారం నుంచి తిరుమలలో బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. తిరుపతిలో సర్వదర్శన టోకెన్ల పంపిణీని నిలిపివేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

