హైదరాబాద్, జూలై 14(నమస్తే తెలంగాణ) : డిప్యుటేషన్‌పై వచ్చి విజయ డెయిరీలో అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని సంస్థ ఉద్యోగులు, సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. నాలుగేండ్ల క్రితం జూనియర్ స్థాయిలో డిప్యుటేషన్‌పై వచ్చిన మనోజ్‌కుమార్ డిప్యుటేషన్ గత మే లోనే ముగిసినందున ఆయనను తిరిగి మాతృసంస్థ అయిన కో ఆపరేటివ్ శాఖకు పంపాలని ప్రభుత్వం ఆదేశించిందని, అయినప్పటికీ ఎండీ తన స్నేహితుడని చెప్పుకుంటూ సంస్థ ఉద్యోగులను బెదిరింపులకు గురిచేస్తున్నాడని ఆరోపించారు. సంస్థలో డిప్యూ టీ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న మధుసూదన్, మనోజ్‌కుమార్, పేసీ అధికారి రాజశేఖర్, ట్రేడ్ యూనియన్ నేత విజయ్ ఓ వర్గంగా ఏర్పడి సంస్థ ఎండీ, చైర్మన్‌కు తప్పుడు సమాచారం ఇస్తున్నారని పేర్కొన్నారు. విజయ డెయిరీ పాలను ప్రైవేట్ డెయిరీలకు అక్రమంగా సరఫరా చేస్తున్నారని, నిబంధనలనకు విరుద్ధంగా సిబ్బందిని బదిలీచేస్తూ డబ్బు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. వీరి అక్రమాలపై విజిలెన్స్ ఎంక్వైరీ చేయించాలని ఉద్యోగులు, మహిళా సిబ్బంది ప్రభుత్వాన్ని కోరుతున్నారు.