జగిత్యాల కలెక్టరేట్, మార్చి 23 : మహిళా కానిస్టేబుల్‌తో అసభ్యంగా ప్రవర్తించిన ఎస్సై వెంకట్రావును సస్పెండ్ చేస్తూ మల్టి జోన్ ఐజీ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం జగిత్యాల డీసీఆర్బీలో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న వెంకట్రావు కొడిమ్యాల ఎస్సైగా పనిచేసిన కాలంలో మూడు నెలల క్రితం తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఓ మహిళా కానిస్టేబుల్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో విచారణ చేపట్టిన పోలీసు అధికారులు పైస్థాయి అధికారులకు నివేదించారు. ఈ మేరకు సదరు ఎస్సైని సస్పెండ్ చేస్తున్నట్టు ఐజీ పేర్కొన్నారు.