హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారి వైకుంఠద్వార దర్శనానికి సంబంధించిన టికెట్లను శనివారం తితిదే ఆన్లైన్లో విడుదల చేసింది. జనవరి 2న వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయంలో 10 రోజులపాటు తితిదే ఉత్తర ద్వారాలు తెరవనున్నది.
రోజుకు 20 వేల చొప్పున.. రెండు లక్షల టికెట్లను భక్తులకు అందుబాటులోకి తెచ్చింది. కేవలం 40 నిమిషాల్లోనే రెండు లక్షల టికెట్లు అమ్ముడుపోవడం విశేషం.