హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : తిరుమల శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్ల కోటాను టీటీడీ బుధవారం ఆన్లైన్లో విడుదల చేసింది. ఈ-సేవా టికెట్ల ఎలక్ట్రానిక్స్ లక్కీ డిప్ కోసం ఈ నెల 20న ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. లక్కీ డిప్ టికెట్లు పొందిన భక్తులు 22న మధ్యా హ్నం 12 గంటలలోపు డబ్బులు చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. తిరుప తి గోవిందరాజ స్వామివారి ఆలయంలో బుధవారం సాయంత్రం పౌర్ణమి గరుడసేవను కనులపండువగా నిర్వహించారు.