హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): నల్లగొండ జిల్లా వెంకటాపురానికి చెందిన చొప్పరి యాదయ్య శ్రీశైలం మల్లికార్జునస్వామి దర్శనానికి స్నేహితులతో కలిసి వచ్చారు. శ్రీశైలం జలాశయంలో లింగాలగట్టు పెద్ద బ్రిడ్జ్ కింద స్నానానికి వెళ్లిన యాదయ్య వరద ఉధృతికి అందరూ చూస్తుండగానే నీటిలో గల్లంతయ్యాడు.
‘శ్రీశైలం’లో మద్యం మత్తులో ఉద్యోగి
హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): శ్రీశైలం ఆలయంలో ఓ ఉద్యోగి మద్యం సేవించి విధులకు హాజరుకాగా గమనించిన భక్తులు చితకబాదిన ఘటన గురువారం రాత్రి క్యూ కం పార్టుమెంట్లో జరిగింది. ఈవో పెద్దిరాజుకు భక్తులు ఫిర్యాదు చేయగా చర్య లు తీసుకుంటామని ఈవో చెప్పారు.
76 మందికి హెడ్ కానిస్టేబుళ్లుగా ఉద్యోగోన్నతి
హైదరాబాద్, ఆగస్టు 2(నమస్తే తెలంగాణ): చార్మినార్ జోన్-6 పరిధిలో 76 మంది కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా ఉద్యోగోన్నతి కల్పిస్తూ మల్టీ జోన్-2 ఐజీ పీవీ సత్యనారాయణ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్, సైబరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని వీరు సివిల్ విభాగంలో ఉద్యోగోన్నతి పొందినట్టు ఐజీ తెలిపారు.