హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): నగరానికి వచ్చిన ఓబీసీ నాయకులతో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ ఆదివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో చేపట్టిన కులగణనలో దొర్లిన లోపాలను వారికి వివరించారు. దేశవ్యాప్తంగా ఓబీసీలకు చట్టసభలు, విద్యా, ఉద్యోగాల్లో ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరమున్నదని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీపీ మండల్ మనుమడు, ప్రొఫెసర్ సూరజ్ యాదవ్, ప్రొఫెసర్ సందీప్‌కుమార్, ఢిల్లీ, బీహెచ్‌యూ ప్రొఫెసర్లు కృష్ణకాంత్, శ్రీనివాస్‌యాదవ్ తదితరులు ఉన్నారు.