తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించిన ఘనత బీఆర్ఎస్ సర్కార్‌దేనని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. గురువారం మహబూబ్‌నగర్ అర్బన్ మండలం ఎదిర గ్రామంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు క్యామ మల్లేశంతో కలిసి దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని శ్రీనివాస్‌గౌడ్ ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌లోని కోకాపేటలో రూ.1000 కోట్ల విలువైన స్థలాలు కులసంఘాల భవనాలకు ఇవ్వడంతోపాటు రూ.14 కోట్లతో భవనాలు నిర్మించి ఇచ్చామని గుర్తుచేశారు. కుల సంఘాలు ఆత్మగౌరవంతో బతికేలా చేశామని అన్నారు. – మహబూబ్‌నగర్