పెండింగ్ పనులూ పూర్తిచేయని కాంగ్రెస్.. అభివృద్ధిపై దృష్టి సారించాలి : శ్రీనివాస్‌గౌడ్
పెండింగ్ పనుల పూర్తి చేయని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యక్తిగత దూషణలు మానుకొని అభివృద్ధిపై దృష్టి సారించాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సూచించారు.
మహబూబ్‌నగర్ అర్బన్, ఫిబ్రవరి 5 : పెండింగ్ పనుల పూర్తి చేయని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యక్తిగత దూషణలు మానుకొని అభివృద్ధిపై దృష్టి సారించాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సూచించారు. గురువారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పలు వార్డులలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ హయాంలో జిల్లా కేంద్రంలోని మెట్టుగడ్డలో నిర్మించిన మార్కెట్ భవనాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేండ్లు పూర్తయినా ఈ పనులు పూర్తి చేయలేదని మండిపడ్డారు. దీంతో కుక్కలు, పందులు, తాగుబోతులకు అడ్డాగా మారిందని విమర్శించారు. మార్కెట్ భవనం మందుబాబులకు నిలయమైందన్నారు.
అందులో గ్రం థాలయం ఏర్పాటు చేస్తామంటే ఎలా? అని నిలదీశారు. పాలమూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేసి మేయర్ పదవి అప్పగిస్తే మిగిలిన పనులను పూర్తి చేస్తామని వెల్లడించారు. టౌన్‌హాల్ ఎందుకు ఓపెన్ చేయడం లేదని.. వెయ్యి పడకల దవాఖాన పూర్తయినా..
వసతులు కల్పించేందుకు రూ.500 కోట్ల టెండర్లు ఎందుకు పిలువడం లేదని ప్రశ్నించారు. శిల్పారామం, ట్యాంక్‌బండ్ పరిస్థితి ఏమిటి? మైనార్టీ గురుకులాలు ఎందుకు పూర్తి చేయలేదు.. మన్యంకొండ రోప్‌వే పనులు ఎప్పుడు ప్రారంభిస్తారో? కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలని నిలదీశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mayor Reservations | ఏపీలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Jobs | నేవల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు
‘దొరికింది దొరికినట్లే దోచుకుంటున్నారు’
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

