హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ) : సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ తొలి వీసీగా ప్రొఫెసర్ లక్ష్మీ శ్రీనివాస్ యడవల్లి నియమిమిస్తూ కేంద్ర విద్యాశాఖ మంగళవారం ఉత్తర్వులిచ్చింది. ఇప్లూలో ఆచార్యుడిగా పనిచేసిన వైఎల్ శ్రీనివాస్ ప్రస్తుతం ఆరోరా విద్యాసంస్థలో పనిచేస్తున్నారు. వీసీగా ఐదేండ్లు లేదా 70 ఏండ్ల వరకు కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.