హైదరాబాద్, మార్చి29 (నమస్తే తెలంగాణ): స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కన్సల్టెంట్గా రిటైర్డ్ ఈఈ శ్రీనివాసులు ను ప్రభుత్వం నియమించింది. కేంద్రం నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021 తీసుకురాగా, రాష్ర్టాలు రాష్ట్రస్థాయిలో డ్యామ్ సేఫ్టీ అథారిటీని ఏర్పా టు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రస్థాయిలో ఈఎన్సీ చైర్మన్గా స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీని ప్రభుత్వం ఏ ర్పాటు చేసింది. ఆనకట్టల రక్షణ, మరమ్మతులు, పర్యవేక్షణ విభాగంలో 30 ఏండ్ల అనుభవమున్న శ్రీనివాసులకు ఆ బా ధ్యతలు అప్పగించింది. తెలంగాణ రాష్ట్రంలో నీటి పారుదలశాఖలో డ్యామ్ సేఫ్టీ విభాగంలో పనిచేసిన తొలి ఈఈగా ఆయన కు గుర్తింపు ఉంది. పలు కీలక, పురాతన డ్యామ్ల సంరక్షణకు విశేష కృషి చేసిన ఆయన, 2020లో ఉద్యోగ విరమణ చేశారు.