హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ) : శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజు బుధవారం ఉదయం శ్రీమలయప్పస్వామి కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్ అలంకారంలో దర్శనమిచ్చారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జియ్యంగార్ల గోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. వాహనసేవలో తిరుమల పెద జీయర్‌స్వామి, చినజీయర్‌స్వామి, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి, పలువురు బోర్డు సభ్యులు పాల్గొన్నారు.