హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ) : తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఈ నెల10 నుంచి 18 వరకు వైభవంగా నిర్వహించనున్నట్టు టీటీడీ తెలిపింది. 10న ధ్వజారోహణం, 14న గజవాహనం, 15న స్వర్ణ రథం, గరుడ వాహనం, 17న రథోత్సవం, 18న పంచమితీర్థం, 19న పుష్పయాగం నిర్వహిస్తారని పేర్కొన్నది.
ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహనసేవలు జరుగుతాయని వివరించింది.