యాదగిరిగుట్ట, ఏప్రిల్ 26 : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి స్వయంభూ ప్రధానాలయం, అనుబంధ దేవాలయం శ్రీపూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం లక్ష్మీనృసింహస్వామి జయంత్యుత్సవాలను అర్చకులు అత్యంత వైభవంగా ప్రారంభించారు.
ఆలయ ముఖమండపంలో స్వస్తివాచనం, విష్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, రుత్విక్ వరణం, కుంకుమార్చన, రక్షాబంధనం వంటి కైంకర్యాలను చేపట్టారు. సాయంత్రం తిరువేంకటపతి అలంకారసేవలో శ్రీస్వామివారిని ఊరేగించారు.