హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): టెన్త్ ఫలితాల్లో 594 అత్యధిక మార్కులు సాధించి విజయకేతనం ఎగురవేసినట్టు శ్రీ చైతన్య స్కూల్ డైరెక్టర్ సీమ తెలిపారు. 593కి పైగా మార్కులను ముగ్గురు, 580కి పైగా 374 మంది, 550కి పైగా 3,969 మంది విద్యార్థులు మార్కులు సాధించినట్టు పేర్కొన్నారు. ఇంగ్లిష్‌లో 10,866 మంది ‘ఏ’ గ్రేడ్, సోషల్‌లో 10,320 మంది విద్యార్థులు ‘ఏ’ గ్రేడ్, సెకండ్ లాంగ్వేజ్‌లో 10,158 మంది ‘ఏ’ గ్రేడ్, సైన్స్‌లో 9,983 మంది ‘ఏ’ గ్రేడ్, మ్యాథ్స్‌లో 9,898 మంది ‘ఏ’ గ్రేడ్, ఫస్ట్ లాం గ్వేజ్లో 9,786 మంది విద్యార్థులు ‘ఏ’ గ్రేడ్ పొందినట్టు వెల్లడించారు. మొత్తంగా 11,428 మంది విద్యార్థులకుగాను శ్రీ చైతన్య స్కూల్ సగటున 600 మార్కులకు 531, ఓవరాల్ పాస్ పర్సంటేజ్ 99.3%, అత్యధిక బ్రాంచ్‌లు నూటికి నూ రుశాతం ఫలితాలు సాధించనట్టు ఆమె తెలిపారు. విద్యార్థులను శ్రీ చైతన్య స్కూల్ డైరెక్టర్లు సీమ, నాగేంద్ర అభినందించారు.
నారాయణ స్కూల్స్ విజయశంఖారావం
హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ) : పదో తరగతి ఫలితాల్లో నారాయణ స్కూల్స్ విద్యార్థులు విజయశంఖారావం మోగించారు. శ్రీమారెడ్డి 594 మార్కులతో స్టేట్ టాప్ ర్యాంకుతో చరిత్ర సృష్టించింది. 593, 592, 590కి పైగా మార్కులను 22 మంది విద్యార్థులు సాధించారని నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్లు పీ సింధూర, పీ శరణి, కోర్ కమిటీ సభ్యురాలు రమా నారాయణ తెలిపారు. మ్యాథ్స్‌లో 5,909 మంది ‘ఏ’ గ్రేడ్, సైన్స్‌లో 5,702 మంది ఏ’ గ్రేడ్, సోషల్‌లో 6,485 మంది ఏ’ గ్రేడ్, ఇంగ్లిష్‌లో 7,124 మంది ఏ’ గ్రేడ్, ఫస్ట్ లాం గ్వేజ్లో 5,789 మంది ఏ’ గ్రేడ్, సెకండ్ లాంగ్వేజ్‌లో 5,867 మంది ఏ’ గ్రేడ్, మొత్తంగా 36,876 మంది ఏ’ గ్రేడ్ సాధించినట్టు పేర్కొన్నారు. తెలంగాణలో సగటున 517 మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ నారాయణ మాత్రమే అని వెల్లడించారు. 66బ్రాంచీల్లో 100% పాస్ పర్సంటేజ్ సాధించినట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కే పునీత్, డైరెక్టర్లు అభినందించారు.