హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ) : జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యా సంస్థలు మరోసారి తమ అపూర్వ ప్రతిభను చాటుకున్నాయి. ఆలిండియా ఓపెన్ క్యాటరిలో తెలంగాణ బెస్ట్ ర్యాంకు శ్రీచైతన్య హైదరాబాద్ విద్యార్థి మోహిత్ శేఖర్ శుక్లా 4వర్యాంకు సాధించాడు. ఎం నాగ సహస్ర 9వ ర్యాంకుతో ఆంధ్రప్రదేశ్ బెస్ట్ ర్యాంకు సాధించాడు.
సిక్క దర్శ 10వర్యాంకుతోపాటు టాప్ 10లోపు 3 ర్యాంకులు, టాప్ 100లోపు 4, 9, 10, 17, 21, 26, 28, 30, 31, 36, 37, 38, 40, 41, 44, 45, 52, 56, 59, 62, 64, 66, 67, 72, 73, 74, 79, 81, 87, 91, 92, 93, 95, 98, 99 ర్యాంకులతో టాప్ 100లోపు 35కుపైగా ర్యాంకులు, టాప్ 1000లోపు 196కు పైగా ర్యాంకులు సాధించి తమ ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించారు. ఈ సందర్భంగా శ్రీ చైతన్య విద్యాసంస్థల అకాడమిక్ డైరెక్టర్, సీఈవో సుష్మ బొప్పన ప్రతిభ చూపిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపకులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు.