హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): నీట్-2023 ర్యాంకుల్లో తమ విద్యార్థులు కొత్త చరిత్ర సృష్టించారని శ్రీచైతన్య విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్, ఇన్ఫినిటీ లెర్న్ ఫౌండర్-డైరెక్టర్ సుష్మ తెలిపారు. గతంలో నీట్ ఓపెన్ క్యాటగిరీలో ఆలిండియా నంబర్ వన్ ర్యాంకు, ఇటీవల విడుదలైన ఏపీ స్టేట్ ర్యాంకుల్లోనూ బీ వరుణ్ చక్రవర్తి నంబర్‌వన్ ర్యాంకు, సోమవారం తెలంగాణలో విడుదలైన ఫలితాల్లోనూ స్టేట్ నంబర్ వన్ ర్యాంకును రఘురామ్‌రెడ్డి సాధించాడని తెలిపారు.
టాప్ ర్యాంకుల్లోనూ, మొత్తం ర్యాంకుల్లోనూ తమ విద్యార్థులు ఆధిపత్యాన్ని కొనసాగించారని పేర్కొన్నారు. టాప్ పదిలోపు 7 ర్యాంకులు, టాప్ 100లోపు 67 ర్యాంకులు కైవసం చేసుకున్నారని తెలిపారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను శ్రీచైతన్య విద్యాసంస్థల అధినేత డాక్టర్ బీఎస్ రావు అభినందించారు.