హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ) : జేఈఈ మెయిన్స్ 2026 ఫలితాల్లో శ్రీచైతన్య సంచలన రికార్డు సృష్టించింది. ఇద్దరికి 300 మార్కులకు 300 మార్కులతో ఓపెన్ క్యాటగిరీలో బీవీసీ శేఖర్‌రెడ్డి, పసల మోహిత్ రెండు ఆలిండియా ఫస్ట్ ర్యాంకులు సాధించారు. ఆరుష్ సింఘాల్ ఆలిండియా ఓపెన్ క్యాటగిరీలో 8వ ర్యాంకు, యశ్వర్ధన్ 11వ ర్యాంకు, జేఆర్ మణిదీప్‌రెడ్డి 15వ ర్యాంకు సాధించారు. ఆలిండియా ఓపెన్ క్యాటగిరీలో టాప్ 10లోపు 3 ర్యాంకులు, 100, 1,000 లోపు అత్యధిక ర్యాంకులు సాధించి రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా శ్రీ చైతన్య విద్యా సంస్థల అకడమిక్ డైరెక్టర్ శ్రీమతి సుష్మ బొప్పన మాట్లాడుతూ.. మూడేండ్లుగా జేఈఈ మెయిన్స్‌లో 300 మార్కులకు 300 మార్కులు సాధిస్తూ హ్యాట్రిక్ రికార్డు సృష్టించడం శ్రీచైతన్యకే సాధ్యమైందని తెలిపారు. ఈ ఘన విజయం సాధించిన విద్యార్థులు, సహకారం అందించిన తల్లిదండ్రులు, అధ్యాపక బృందానికి అభినందనలు తెలిపారు.