హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ) : నీట్ ఫలితాల్లో ఆలిండియా ఫస్ట్ ర్యాంకు సాధించి శ్రీ చైతన్య తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఆలిండియా ఓపెన్ క్యాటగిరీలో 1వ ర్యాంకు, 3వ ర్యాంకు, 9వ ర్యాంకుతోపాటు ఆలిండియా ఓపెన్ క్యాటగిలో 10లో 8 ర్యాంకులు ఒక శ్రీ చైతన్యనే సాధించి టాప్ ర్యాంకులోనూ, టోటల్ ర్యాంకుల్లోనూ తిరుగులేని అగ్రస్థానంతో దూసెకెళ్తింది. ఆలిండియా ఓపెన్ క్యాటిగిరీలో ఆర్యన్ గుప్తా 1వ ర్యాంకు, శియా గోయాల్ 3వ ర్యాంకు, గౌరవ్ సింగ్ 9వ ర్యాంకుతోపాటు ఆలిండియా 5 వ ర్యాంకును బుర్రా సాయి చరణ్, కే హనీశ్ 6 వ ర్యాంకు సాధించారు.
వీటితోపాటు ఆలిండియా ఓపెన్ క్యాటగిరీలో 10 లోపు 3 ర్యాంకులు, 20 లోపు 6, 50 లోపు 12 ర్యాంకులు, 100 లోపు 18 ర్యాంకులు, 1000 లోపు 84 ర్యాంకులు, కేటగిరీ ర్యాంకుల్లో 10 లోపు 8, 100 లోపు 67 ర్యాంకులు శ్రీ చైతన్య విద్యార్థులవే. ఈ సందర్భంగా విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ శ్రీమతి సుష్మ మాట్లాడుతూ.. విద్యార్థులు సాధించిన ర్యాంకులపై హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులకు అభినందనలు తెలిపారు.