హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ) : అఖండ ఇన్ఫ్రాటెక్-ఎకోర్ ఇండస్ట్రీస్ కంపెనీలకు మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీల కేసులో బెయిల్ కోసం ‘ఐ న్యూస్’ చానల్ ఎండీ, ఇన్‌రిథమ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ శ్రవణ్‌కుమార్‌రావు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఉపసంహరించుకున్నారు. బుధవారం ఆ పిటిషన్ వేసవి సెలవుల ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జస్టిస్ శరత్ ముందుకు వచ్చింది.
దానిపై విచారణ జరించేందుకు జస్టిస్ శరత్ నిరాకరిస్తూ.. విచారణ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. దీంతో ఆ వ్యాజ్యం జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ ధర్మాసనానికి బదిలీ అయింది. న్యాయమూర్తి విచారణ చేపట్టడానికి ముందే శ్రవణ్‌కుమార్‌రావు పిటిషన్ ఉపసంహరించుకుంటున్నట్టు ఆయన తరఫు న్యాయవాది చెప్పారు.
హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియో-ఇన్ఫర్మేటిక్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంస్థకు ఢిల్లీలోని కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ ప్రతిష్ఠాత్మక అక్రెడిటేషన్ హోదాను మంజూరు చేసింది. సీహెచ్ వెంకటేశ్వర్రావు నేతృత్వంలోని సీబీసీ నిపుణుల బృందం ఈ నెల 27, 28న ఆన్-సైట్ అసెస్మెంట్ నిర్వహించిన అనంతరం 8 ప్రధాన అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ హోదాను కల్పించినట్టు ఎన్ఐజీఎస్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఎన్ఐజీఎస్టీని జియోస్పేషియల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ రంగంలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా తీర్చిదిద్దాలని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సూచించారు.