హనుమకొండ, ఏప్రిల్ 29 : పదో తరగతి ఫలితాల్లో ఎస్ఆర్ స్కూల్స్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ సారి కూడా జిల్లా, రాష్ట్రస్థాయిలో సత్తా చాటారు. ఫలితాల్లో సీ సంస్కృతరెడ్డి 589 మారులతో మొదటి స్థానం పొందారు.
పిరాంజి వంశీ (588), ఎస్ కీర్తన(587), అంకం సౌజన్య(587), ఏ సంజ య్ (586), టీ వైష్ణవి (585), బాశెట్టి సాయిశ్రీ(584) ఉత్తమ ప్రతిభ కనబరిచినట్టు విద్యాసంస్థల చైర్మన్ వరదారెడ్డి తెలిపారు. 22మంది విద్యార్థులు 580కి పైగా మారులు సాధించినట్టు చెప్పారు. అఖండ విజయం సాధించిన విద్యార్థులను యాజమాన్యం, సంస్థ డైరెక్టర్లు మధుకర్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి అభినందించారు.