హైదరాబాద్, అక్టోబర్16 (నమస్తే తెలంగాణ): బీసీ, ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలోని పలు లా కాలేజీల్లో సీట్ల భర్తీకి 19వ తేదీన స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆయా సొసైటీల కార్యదర్శులు సైదులు, వర్షిణి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం బాలుర లా కాలేజీలో 47, హనుమకొండ జిల్లా కాజీపేటలోని బీసీ గురుకుల వుమెన్ లా కాలేజీలో 39, సరూర్‌నగర్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల ఇంటిగ్రేటెడ్ లా కాలేజీలో 29సీట్లు అందుబాటులో ఉన్నట్టు వెల్లడించారు.
లాసెట్ – 2024లో అర్హత సాధించిన అభ్యర్థులు అర్హులని, ఒరిజినల్ సర్టిఫికెట్లతో నేరుగా 19వ తేదీన ఆయా కళాశాలల్లో నిర్వహించే స్పాట్ అడ్మిషన్లకు హాజరుకావాలని వెల్లడించారు. పూర్తి వివరాలకు 93966 00601, 99083 44469 నంబర్లలో సంప్రదించాలని కార్యదర్శులు సూచించారు.