Minister Vemula | సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణంలో వేగం పెంచాలి : మంత్రి వేముల
Minister Vemula | పేద ప్రజలకు కూడా కార్పొరేట్ స్థాయిలో మెరుగైన వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి పూనుకున్నారని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి(Minister Vemula) అన్నారు.
హైదరాబాద్ : పేద ప్రజలకు కూడా కార్పొరేట్ స్థాయిలో మెరుగైన వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి పూనుకున్నారని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి(Minister Vemula) అన్నారు. నిర్ధారిత గడువులోగా ఆసుపత్రులు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో చేపట్టిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణ పురోగతిపై హైదరాబాద్‌లోని ఆర్ అండ్ బి కార్యాలయంలో అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో మంత్రి సమీక్ష(Review) నిర్వహించారు. వరంగల్(Warangal) మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రితోపాటు ఎల్బీనగర్ టిమ్స్ (LB Nagar TIMS), అల్వాల్ టిమ్స్(Alwal TIMS), సనత్ నగర్(Sanathnagar TIMS) టిమ్స్ తదితర అసుపత్రుల నిర్మాణాలపై చర్చించారు. ఈ సందర్భంగా వరంగల్ సూపర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పురోగతిపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు.
నిర్మాణంలో వేగం పెంచాలని, అవసరమైతే ఎక్కువమంది కార్మికులను నియమించుకోవాలని సూచించారు. జూన్ 22న తాను వరంగల్ హాస్పిటల్ పనులను పరిశీలించనున్నట్లు తెలిపారు. ఈ ఆసుపత్రి అందుబాటులోకొస్తే ఎంతో మంది పేద ప్రజలకు మెరుగైన వైద్యం లభిస్తుందని అన్నారు. సీఎం కేసీఆర్(CM KCR) నిర్ధారించిన గడువులోగా నిర్మాణం పూర్తి కావాలని వర్క్ ఏజెన్సీని,ఆర్ అండ్‌బీ అధికారులను మంత్రి అదేశించారు. అనంతరం హైదరాబాద్‌లో నిర్మిస్తున్న టిమ్స్ ఆసుపత్రుల పురోగతిని మంత్రి తెలుసుకున్నారు. ఎల్బీనగర్లో చేపట్టిన వెయ్యి పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు ఈనెల 26 వరకు ప్రారంభం కావాలని స్పష్టం చేశారు.
అల్వాల్‌లో చేపట్టిన 1200 పడకల ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం సనత్ నగర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ స్ట్రక్చరల్ డిజైన్స్‌ను పరిశీలించారు. ఈనెల 29 న అల్వాల్,సనత్ నగర్ హాస్పిటల్స్ నిర్మాణ సైట్ లను క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తానని మంత్రి చెప్పారు.ఈ సమీక్షలో ఆర్ అండ్‌బీ ఈఎన్సీ గణపతి రెడ్డి, ఎస్ఈ లు సత్యానారయణ,హఫీజ్, నాగేందర్ రావు,ఈఈ నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

