
సూర్యాపేట టౌన్, నవంబర్ 8: సూర్యాపేటలో సోమవారం నిర్వహించిన ప్రీ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి విశేష స్పందన లభించింది. ది సోల్జర్ యూత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఎస్వీ కళాశాల మైదానంలో నిర్వహించిన ప్రీ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రారంభించారు. ఈ ర్యాలీకి ఆయా జిల్లాల నుంచి 1,962 మంది హాజరుకాగా.. 274 మంది ఎంపికైనట్టు నిర్వాహకులు తెలిపారు. వారికి డిసెంబర్ ఒకటి నుంచి రెండు నెలలపాటు సూర్యాపేటలో శిక్షణ ఉంటుందన్నారు. ఈ ర్యాలీలో ఎంపికైన వారికి రెండు నెలల శిక్షణ కాలంలో భోజనం, ఇతర సౌకర్యాలను తాను సొంతంగా సమకూరుస్తానని మంత్రి ప్రకటించారు. కార్యక్రమంలో కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి, ఎస్పీ రాజేంద్రప్రసాద్, సోల్జర్ యూత్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కర్నల్ ఎస్ శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు.