హైదరాబాద్ : తెలంగాణ భాష, సంస్కృతితో పాటు జానపద కళలను ప్రోత్సహించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాధాన్యం కల్పించిందని సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పురాతన జానపద కళలకు ప్రాముఖ్యత కల్పించిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ముగ్గురు కళాకారులకు ప్రత్యేక పెన్షన్ ప్రకటించారు. నాగర్కర్నూల్ జిల్లా ఆవుసలికుంటకు చెందిన 12 మెట్ల కిన్నెర మొగులయ్య, కుమ్రం భీం జిల్లాకు చెందిన గుస్సాడీ నృత్య పద్మ శ్రీ అవార్డు గ్రహీత కనక రాజు, ప్రముఖ ఫోటోగ్రఫర్ భరత్ భూషణ్లకు రూ. 10 వేల చొప్పున ప్రత్యేక పెన్షన్ను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం కళాకారులను మంత్రి సన్మానించారు.
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ప్రముఖ కళాకారుడు 12 మెట్ల కిన్నెర మొగులయ్య గారు, గుస్సాడీ నృత్య పద్మ శ్రీ అవార్డు గ్రహీత కనక రాజు గారు, ప్రముఖ ఫోటోగ్రఫర్ భరత్ భూషణ్ గార్లకి 10 వేల రూపాయల ప్రత్యేక పెన్షన్ ను అమలు చేయాలని సంబంధింత అధికారులను ఆదేశించడం జరిగింది. pic.twitter.com/fPfRKXCrFO
— V Srinivas Goud (@VSrinivasGoud) May 31, 2021