హైదరాబాద్ : మత్స్యకారుల సభ్యత్వ నమోదుకు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. మాసాబ్ ట్యాంక్ లోని కార్యాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్పరెన్స్ లో మంత్రి మాట్లాడారు. మూడు నెలలపాటు నిర్వహించే స్పెషల్ డ్రైవ్ లో లక్షా 30 వేల మందికి సభ్యత్వాలు కల్పించాలని లక్ష్యమని వెల్లడించారు.
18 సంవత్సరాలు నిండిన ప్రతి మత్స్యకారుడికి సభ్యత్వాన్ని అందిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఉచితంగా చేప, రొయ్య పిల్లలను పంపిణీ చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పెరిగిన మత్స్య సంపద ఫలితాలను మత్స్యకారులకు పంపిణీ చేయాలనేది ప్రభుత్వ లక్ష్యమని, ముఖ్యమంత్రి ఆలోచనలతోనే మత్స్యరంగం ఎంతో అభివృద్ధి సాధించిందని అన్నారు.