Special Trains | ఢిల్లీ, ప్రయాగ్‌రాజ్, వారణాసి వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. సికింద్రాబాద్ నుంచి నిజాముద్దీన్, చర్లపల్లి నుంచి దానాపూర్‌కు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు చెప్పింది. ఈ నెల 28, నవంబర్ 2 తేదీల్లో ఈ ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగిస్తాయని.. ప్రస్తుతం ఉన్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఈ రైళ్లను నడిపిస్తున్నట్లు చెప్పింది. సికింద్రాబాద్-హజ్రత్ నిజాముద్దీన్ (07081) రైలు అక్టోబర్ 28, నవంబర్ 2 తేదీల్లో రాకపోకలు సాగిస్తుందని.. తిరిగి నిజాముద్దీన్ నుంచి సికింద్రాబాద్ (07082) రైలు అక్టోబర్ 30, నవంబర్ 4 తేదీల్లో రైలు నడుస్తుందని పేర్కొంది.
ఈ రైలు మేడ్చల్, కామారెడ్డి, నిజామాబాద్, బాసర, ముఖ్దేడ్, నాందేడ్, పూర్ణ, బస్మత్, హింగోలి, వాసిమ్, అకోలా, మల్క్పూర్, ఖండ్వా, ఇటార్సీ, నర్మదాపురం, రాణి కమలాపతి, భోపాల్, భోపాల్, బినా, ఝాన్సీ, గ్వాలియర్, దౌల్హాపూర్, ఆగ్రా, మథు స్టేషన్లలో రైలు ఆగుతుందని చెప్పింది. రైలు ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్ క్లాస్, సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉన్నాయని వివరించింది. అలాగే చర్లపల్లి నుంచి దాదాపూర్‌కు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు చెప్పింది. చర్లపల్లి-దానాపూర్ (07091) రైలు ఈ నెల 23, 28 తేదీల్లో నడుస్తుందని.. ఆయా రోజుల్లో ఉదయం 9.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 9.45 గంటలకు గమ్యస్థానం చేరుతుందని చెప్పింది.
దానాపూర్-చర్లపల్లి (07092) రైలు 24, 29 తేదీల్లో నడుస్తుందని.. రాత్రి 9.15 గంటలకు బయలుదేరి రెండోరోజు ఉదయం 7.30 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుందని పేర్కొంది. చర్లపల్లి-దానాపూర్ (07049) రైలు 26న ఉదయం 9.30 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు సాయంత్రం 7.45గంటలకు దానాపూర్ స్టేషన్‌కు చేరుతుందని పేర్కొంది. దానాపూర్-చర్లపల్లికి (07050) రైలు 27న రాత్రి 9.15 గంటలకు బయలుదేరి రెండోరోజు ఉదయం 7.30 గంటలకు రైలు చర్లపల్లికి వస్తుందని వివరించింది. ఈ రైలు కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్‌నగర్, బల్లార్షా, నాగ్‌పూర్, ఇటార్సీ, జబల్పూర్, కట్ని, మైహర్, సాట్న, ప్రయాగ్‌రాజ్, పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ, బక్సర్, ఆర స్టేషన్లలో ఆగుతుందని చెప్పింది.