OTT Movies | సంక్రాంతి సినిమాల సందడి ఇంకా థియేటర్లలో కొనసాగుతుండగానే, ఈ వారం ప్రేక్షకులను అలరించేందుకు మరికొన్ని సినిమాలు సిద్ధమయ్యాయి. ఒకటి రెండు పెద్ద సినిమాల జోష్ తగ్గకముందే కొత్త కంటెంట్‌తో థియేటర్లు, ఓటీటీ ప్లాట్‌ఫాంలు మరింత హీట్ పెంచనున్నాయి. మలయాళ రీమేక్ మూవీ నుంచి ప్రయోగాత్మక టాకీ సినిమా వరకు, అలాగే బాలీవుడ్ సినిమాల వరకు విభిన్న జానర్ల చిత్రాలు ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అదే సమయంలో ఓటీటీ వేదికగా కూడా కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్కు సిద్ధమవుతున్నాయి. ఈ వారం విడుదల కానున్న ప్రధాన సినిమాలపై ఓసారి లుక్ వేస్తే..
కపుల్ రిలేషన్షిప్ నేపథ్యంలో తెరకెక్కిన ‘ఓం శాంతి శాంతి శాంతిః’ ఈ వారం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. భార్యపై పెత్తనం చెలాయించాలనే మనస్తత్వం కలిగిన భర్తకు ఓ మహిళ ఎలా బుద్ధి చెబుతుందనే కథాంశంతో ‘ఓం శాంతి శాంతి శాంతిః’ సినిమా రూపొందింది. మలయాళంలో సంచలన విజయం సాధించిన ‘జయ జయ జయహే’ చిత్రానికి ఇది తెలుగు రీమేక్. డైరెక్టర్ తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా నటించిన ఈ సినిమా ఈ నెల 30న థియేటర్లలో విడుదల కానుంది. ఏఆర్ సజీవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బ్రహ్మాజీ, సురభి ప్రభావతి తదితరులు కీలక పాత్రలు పోషించగా, సోషల్ మెసేజ్‌తో కూడిన ఎంటర్టైనర్గా ఇది ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశాలు ఉన్నాయి.
ఇక మరోవైపు ప్రయోగాత్మక సినిమాల అభిమానులకు ప్రత్యేక ట్రీట్‌గా ‘గాంధీ టాక్స్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒకప్పటి ‘పుష్పక విమానం’ తరహాలో డైలాగ్స్ లేకుండా కథను చెప్పే ప్రయత్నంతో రూపొందిన ఈ టాకీ మూవీ ప్రత్యేకత సంతరించుకుంది. విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అదితీరావ్ హైదరీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది. కిశోర్ పాండురంగ్ బేలేకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించడం మరింత ఆసక్తిని పెంచుతోంది.
బాలీవుడ్ నుంచి మరో ఆసక్తికర చిత్రం ‘మయసభ’ కూడా ఈ వారం థియేటర్లలో సందడి చేయనుంది. ‘తుంబాడ్’ వంటి డిఫరెంట్ స్టోరీతో ప్రేక్షకులను కట్టిపడేసిన దర్శకుడు రాహి అనిల్ బార్వే తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు రేకెత్తిస్తోంది. ఈ నెల 30న విడుదల కానున్న ఈ చిత్రం కూడా డిఫరెంట్ కంటెంట్‌ను ఆశించే ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
అలాగే హిట్ ఫ్రాంచైజీగా నిలిచిన ‘మర్దానీ’ సిరీస్ మూడో భాగంతో మరోసారి థియేటర్లలోకి రాబోతోంది. మహిళల అక్రమ రవాణా, కిడ్నాప్ వంటి సామాజిక సమస్యల నేపథ్యంలో రూపొందిన ఈ ఫ్రాంచైజీకి మంచి ప్రేక్షకాదరణ ఉంది. ఈసారి కూడా రాణీ ముఖర్జీ పోలీస్ ఆఫీసర్ శివానీ రాయ్ పాత్రలో కనిపించనున్నారు. శక్తివంతమైన కథాంశం, ఇంటెన్స్ యాక్షన్‌తో ‘మర్దానీ 3’ ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఓటీటీ లో సందడి చేయనున్న మూవీస్ / వెబ్ సిరీస్‌లు చూస్తే..
అమెజాన్ ప్రైమ్ వీడియోలో
దల్ దల్ (వెబ్ సిరీస్ – జనవరి 30)
ది రెక్కింగ్ క్రూ (జనవరి 28)
చీకటిలో (తెలుగు మూవీ)
మారియో (తెలుగు మూవీ)
ఆఫ్టర్ బర్న్ (ఇంగ్లీష్/తెలుగు మూవీ)
నెట్ ఫ్లిక్స్‌లో..
ఛాంపియన్ (జనవరి 29)
బ్రిడ్జర్టన్ (జనవరి 29)
96 మినిట్స్ (జనవరి 30)
మిరాకిల్ : ది బాయ్స్ ఆఫ్ 80 (జనవరి 30)
జియో హాట్ స్టార్
సర్వం మాయ (జనవరి 30)
వండర్ మాన్ (వెబ్ సిరీస్ – జనవరి 28)
స్పేస్ జెన్ : చంద్రయాన్, మార్క్ (మూవీ)
ఆహా
శంబాల (తెలుగు మూవీ)
మారియో (తెలుగు మూవీ)
ఈటీవీ విన్ – గొల్ల రామవ్వ
జీ5
45 మూవీ
కాలి పోట్కా (హిందీ మూవీ)
షార్ట్ అండ్ స్వీట్ (మరాఠీ మూవీ)
మస్తీ 4 (హిందీ మూవీ), సిరాయ్ (తమిళ మూవీ)
మొత్తంగా చూస్తే, ఈ వారం థియేటర్లలో విభిన్న జానర్ల సినిమాలతో ఆడియన్స్‌కు ఫుల్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీగా కనిపిస్తోంది. ఓటీటీలోను సందడి బాగానే ఉంది.