Special Trains | శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. హైదరాబాద్ నుంచి 18 ప్రత్యేక రైళ్లు
Special Trains | అయ్యప్ప దర్శనం కోసం శబరిమల భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. కాచిగూడ, హైదరాబాద్ నుంచి కొట్టాయానికి 18 ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు ప్రకటించింది. కాచిగూడ - కొట్టాయం (07133) మధ్య డిసెంబర్ 5, 12, 19, 26 మధ్య ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది.
Special Trains | అయ్యప్ప దర్శనం కోసం శబరిమల భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. కాచిగూడ, హైదరాబాద్ నుంచి కొట్టాయానికి 18 ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు ప్రకటించింది. కాచిగూడ – కొట్టాయం (07133) మధ్య డిసెంబర్ 5, 12, 19, 26 మధ్య ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ప్రతి గురువారం మధ్యాహ్నం 3.40 గంటలకు బయలుదేరి మరుసటిరోజు సాయంత్రం 6.50 గంటలకు కొట్టాయానికి రైలు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో కొట్టాయం – కాచిగూడ (07134) రైలు 6, 13, 20, 27 తేదీల్లో రాత్రి 8.30 గంటలకు బయలుదేరి.. ఆ తర్వాతి రోజున రాత్రి 11.40 గంటలకు కాచిగూడ స్టేషన్‌కు చేరుతుంది.
రైలు షాద్‌నగర్, జడ్చెర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, గద్వాల్, కర్నూల్ షిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, యెర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట, కాట్పడి, జోలార్‌పేటై, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, పొదనూర్, కోయంబత్తూర్, పాలక్కడ్, తిసూర్, అలువ, ఎర్నాకులం టౌన్ స్టేషన్లలో ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. హైదరాబాద్ – కొట్టాయం (07135) రైలు డిసెంబర్ 3, 10, 17, 24, 31 తేదీల్లో రైలు నడువనున్నది. ప్రతి మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి మరుసటిరోజు 4.10 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుందని పేర్కొంది.
తిరిగి కొట్టాయం – హైదరాబాద్ (07136) రైలు 4, 11, 18, 25, జనవరి 1 తేదీల్లో నడువనున్నది. రైలు గురువారం సాయంత్రం 6.10 గంటలకు బయలుదేరి.. రాత్రి 11.43 గంటలకు హైదరాబాద్ స్టేషన్‌కు చేరుతుంది. రైలు బేగంపేట, లింగంపల్లి, శంకర్పల్లి, వికారాబాద్, తాండూర్, సేరం, యాద్గిర్, కృష్ణా, రాయ్‌చూర్, మంత్రాలయం, ఆదోని, గుంతకల్, గుత్తి, యెర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట, కాట్పడి, జోలార్‌పేటై, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కోయంబత్తూర్, పాలక్కడ్, త్రిసూర్, అలువా, ఎర్నాకులం టౌన్ స్టేషన్లలో ఆగుతుందని వివరించింది. ఆయా రైళ్లలో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచులు అందుబాటులో ఉన్నాయని దక్షిణ మధ్య రైల్వే వివరించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Water conservation | నీటి కోసం స్ఫూర్తిగా నిలిచిన.. ఆదర్శ నగర్ కాలనీ వాసులు
Heart Diseases | పండుగ సమయంలో గుండె జబ్బుల ముప్పు ఎక్కువ.. హృదయ ఆరోగ్యాన్ని ఇలా కాపాడుకోండి..
Two students die | ప్రాణాలు తీసిన సెలవుల సరదా.. క్వారీ గుంతలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి
డిండి ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేయాలి : జూలకంటి రంగారెడ్డి
Madhyapradesh | ఉజ్జయినిలో పెను విషాదం.. విషవాయువు పీల్చి నలుగురు హోటల్ కార్మికులు మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

