Special Trains | ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. దసరా, దీపావళి, ఛట్ పూజ సందర్భంగా ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు ప్రకటించింది. పండుగల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని 22 రైళ్లను సెప్టెంబర్ 4 నుంచి అక్టోబర్ 10 వరకు నడిపించనున్నట్లు వివరించింది. సికింద్రాబాద్-తిరుపతి, కాచిగూడ-నాగర్సోల్, సంత్రగాచి-చర్లపల్లి మధ్య ఈ ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగిస్తాయని పేర్కొంది. సికింద్రాబాద్-తిరుపతి (07009) ప్రత్యేక రైలు సెప్టెంబర్ 4వ తేదీ నుంచి 25 వరకు ప్రతి గురువారం అందుబాటులో ఉంటుందని తెలిపింది.
తిరుపతి-సికింద్రాబాద్ (07010) మధ్య సెప్టెంబర్ 5వ తేదీ నుంచి 26 వరకు ప్రతి శుక్రవారం రాకపోకలు సాగిస్తుందని వివరించింది. ఇక కాచిగూడ-నాగర్సోల్ (07055) రైలు సెప్టెంబర్ 4 నుంచి 25 వరకు ప్రతి గురువారం, నాగర్సోల్-కాచిగూడ (07056) రైలు సెప్టెంబర్ 5 నుంచి 26 వరకు వరకు ప్రతి శుక్రవారం అందుబాటులో ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. అలాగే, సంత్రగాచి-చర్లపల్లి (08845) రైలు సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 3 వరకు ప్రతి శుక్రవారం.. సంత్రగాచి (08846) రైలు సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 4 వరకు రాకపోకలు సాగిస్తుందని వివరించింది.